![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -291 లో... కళ్యాణ్-అనామిక ల పెళ్ళి జరుగుతుంది. వాళ్ళ పెళ్లిలో అనుకోని సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. సంగీత్ అంటు అందరు హుషారుగా డ్యాన్స్ మొదలు పెట్టారు. ఇక దుగ్గిరాల ఇంటి స్టైలిష్ ఆడపడుచు అయిన రుద్రాణి తన డాన్స్ తో సంగీత్ మొదలు పెడుతుంది. అ తర్వాత అపర్ణ, సుభాష్ ఇద్దరు కలిసి మాస్టారు మాస్టరు అంటు తమ హావభావాలతో అలరిస్తారు.
ఆ తర్వాత పద్మావతి ఆ అరుణ్ విషయంలో నాకు హెల్ప్ చేస్తానని చెప్పింది కదా నేను కూడా ఆ మురళి నిజస్వరూపం బయటపెటట్టి పద్మావతికీ హెల్ప్ చెయ్యాలని స్వప్న అనుకోని ట్రూత్ పౌడర్ ని జ్యూస్ లో కలిపి అది మురళికి తాగిస్తే వాడు చేసిన తప్పుడు పనులు గురించి వాడే నిజం చెప్తాడని స్వప్న అనుకొని అదే విషయం కావ్యకి చెప్పగానే మంచి ఐడియా అని అంటుంది. జ్యూస్ లో ట్రూత్ పౌడర్ కలిసి స్వప్న స్వయంగా వెళ్లి మురళికి జ్యూస్ ఇస్తుంది. అది తాగిన మురళి కాసేపటికి ఏదో అవుతున్నట్లుగా స్టేజ్ మీదకి వెళ్లి నిజం చెప్తాడని కావ్య, స్వప్న పద్మావతి ముగ్గురు అనుకుంటారు కానీ మురళి వెళ్లి నేను తాగాను.. నన్ను క్షమించు అని అరవిందని అడుగుతాడు. అదేంటి నేను ట్రూత్ పౌడర్ కలిపాను కదా నిజం చెప్పకుండా అలా చేస్తున్నాడేంటని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత సంగీత్ లో భాగంగా ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరు డాన్స్ చేస్తారు.
కాసేపటికి అనామిక, కళ్యాణ్ లని స్టేజి మీదకి పిలువగా అప్పుని కూడా మనతో డాన్స్ చెయ్యడానికి తీసుకుని వస్తానంటూ అప్పు దగ్గరకి కళ్యాణ్ వెళ్తాడు కానీ అప్పు మాత్రం రాదు. ఇక అనామిక, కళ్యాణ్ ఇద్దరు డాన్స్ చేస్తు ఉంటారు.. మరొకవైపు అప్పు మనసులో ఎవరున్నారో తెలుసుకోవడం కోసం పద్మావతి ట్రూత్ పౌడర్ ని జ్యూస్ లో కలిసి అప్పుకి ఇస్తుంది. అది తాగిన అప్పు.. కళ్యాణ్, అనామికల దగ్గరకి వెళ్లి డాన్స్ చేస్తుంది. అదేంటీ నేను తను ఎవరిని ప్రేమించిoదో చెప్తుందనుకుంటే వెళ్లి డాన్స్ చేస్తుందని కనకంతో పద్మావతి అంటుంది. అప్పు ప్రేమించేది కళ్యాణ్ నే అని కనకం చెప్పగానే పద్మావతి షాక్ అవుతుంది. ఆ తర్వాత అప్పు కళ్యాణ్ ని హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. తరువాయి భాగంలో కళ్యాణ్ ని అప్పు ప్రేమిస్తున్న విషయం కావ్యకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |